![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం karthika Deepam2. ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 757 లో.....జ్యోత్స్న, సూరజ్ కి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకుంటారు. మూడు రోజుల్లో పెళ్లి ఎలా అని దశరథ్ అంటే శివన్నారాయణ కష్టం కాదని అంటాడు. మనవరాలి పెళ్లి అంటే అని పారిజాతం అనగానే శివన్నారాయణ సీరియస్ గా చూస్తాడు. వెంటనే శివన్నారాయణ గారి మనవరాలి పెళ్లి అని మాట మారుస్తుంది. శ్రీధర్ పెద్ద హాల్ బుక్ చేద్దామంటే.. వద్దు.. ఇంటి ముందు పందిరిలోనే సింపుల్ గా చేసేద్దామని సూరజ్ అంటాడు. జ్యోత్స్న, కార్తీక్ కూడా అదే కరెక్ట్ అంటారు. శివన్నారాయణ వాళ్ల ఇష్టమే నా ఇష్టం అని, పెళ్లి పెద్దలు కార్తీక్, దీపలే అని, వంటలు దశరథ్, షాపింగ్ సుమిత్ర చూడాలని పనులు పంచుతాడు.
ఆ టైమ్ లోనే రెస్టారెంట్ లీగల్ పేపర్లు వస్తాయి. శివన్నారాయణ తర్వాత రమ్మంటే సూరజ్ నే తొందరపెట్టి ఇదే మంచి ముహూర్తం, జ్యోత్స్న పెళ్లి ముహూర్తం రోజు రెస్టారెంట్ కొన్నట్టు గుర్తుంటుంది అని నమ్మిస్తాడు. శివన్నారాయణ చదవమంటే సూరజ్ చదివినట్టు యాక్ట్ చేస్తాడు. కార్తీక్ చదవబోతుంటే దీప ఆపేసి సూరజ్ మీద నమ్మకం లేదని జ్యోత్స్న ఫీల్ అవుతుందని లాగేస్తుంది. అందరి చేత సంతకాలు పెట్టిస్తుంటే సూరజ్ కి చెమటలు పడతాయి.. సాక్షి సంతకాలని దీప, కార్తీక్ తో కూడా పెట్టిస్తారు. కార్తీక్ డౌట్ గా కర్చీఫ్ ఇచ్చి అడిగితే పెళ్లి టెన్షన్ అని కవర్ చేస్తాడు.
తర్వాత ఇంట్లోనే చీరల షాపింగ్ పెడతారు. జ్యోత్స్న ఏ చీర చూసినా కళ్లతో సూరజ్ ని అడుగుతుంది. వాడు నచ్చలేదని సైగ చేస్తాడు. అది పారిజాతం, కార్తీక్ కనిపెట్టేస్తారు. పారిజాతం డైరెక్ట్ గా సూరజ్ నే అడిగి చీర సెలెక్ట్ చేయిస్తుంది. శ్రీధర్ డ్యాన్స్ అనగానే పారిజాతం స్టెప్పులేసి అందరిని నవ్విస్తుంది. ఆ నవ్వుల్ని చూసి జ్యోత్స్న ఒక్కసారిగా ఏడ్చేసి సుమిత్రను పట్టుకుని నేను వెళ్లిపోతే నన్ను మర్చిపోతారా అమ్మా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |